Murari 4k | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (mahesh babu) కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది ఆల్ టైమ్ సూపర్ హిట్ క్లాసికల్ మురారి(Murari). క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్ బాబు, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2001లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మురారి ఆగష్టు 09న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అవుతోంది.
రీరిలీజ్‌కు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో మహేశ్ బాబు మేనియా రోజురోజుకీ పెరిగిపోతుంది. మురారి అడ్వాన్స్ సేల్స్ రికార్డు స్థాయిలో నమోదవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాయి. తాజా టాక్ ప్రకారం ఒక్క హైదరాబాద్‌లోనే అడ్వాన్స్ టికెట్ సేల్స్ రూ. కోటి దాటిపోయాయి. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో మురారి సేల్స్ ఎలా ఉండబోతున్నాయన్నది అర్థం చేసుకోవచ్చంటున్నాడు ట్రేడ్ పండితులు. ఇక బర్త్ డే కానుకగా ఎస్ఎస్ రాజమౌళితో చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 నుంచి క్రేజీ అప్డేట్ అందించబోతున్నాడట మహేశ్ బాబు.
Shivam Bhaje | గూస్బంప్స్ తెప్పించేలా శివం భజే.. డైరెక్టర్ అప్సర్పై నెటిజన్ల ప్రశంసలు
Veera Dheera Sooran | విక్రమ్, అరుణ్‌కుమార్ వీరధీరసూరన్ టీం విషెస్.. స్పెషల్ ఇదే..!
Malavika Mohanan | బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్‌లో మాళవిక మోహనన్