RCB | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు 18 ఏళ్ల ఐపీఎల్ ట్రోఫీ కలని నెరవేర్చుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 18వ సీజన్లో, రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో సెలబ్రిటీలు అభినందల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆర్సీబీ గెలిచిన అనంతరం సలార్, కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ సంబరాలు చేసుకున్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో బిజీగా గడుపుతున్న నీల్ మంగళవారం నైట్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ని ఫిల్మ్ సిటీలో వీక్షించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవడంతో నీల్ అనందంతో సంబరాలు చేసుకున్నాడు. తన ఫేవరెట్ టీం 18 ఏండ్ల తర్వాత కప్ గెలవడంతో అనందాన్ని ఆపుకోలేక చిన్నాపిల్లాడిలా ఎగిరి గంతులేశాడు నీల్. దీనికి సంబంధించిన వీడియోను నీల్ భార్య లిఖితా రెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. నాకు తెలిసిన అత్యంత క్రేజీ క్రికెట్ అభిమానిలో ఒకరికి సరైన పుట్టినరోజు(నేడు ప్రశాంత్ నీల్ బర్త్‌డే) బహుమతి ఈ వీడియో లిఖిత రెడ్డి క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Read more