స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar), రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్లో ఆర్సీ 15 (RC15) వ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ (Tollywood)లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూణేలోని ప్రత్యేక సెట్లో ఇటీవలే షూటింగ్ మొదలైంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుత షెడ్యూల్లో రాంచరణ్, కియారా (Kiara Advani)పై వచ్చే స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్టు తాజా సమాచారం.
అత్యంత భారీ స్థాయిలో తీయనున్న ఈ పాటను సుమారు 2 వారాలపాటు షూట్ చేయనున్నారట. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన పాటగా నిలువబోతుందని ఫిలింనగర్ సర్కిల్ లో జోరుగా చర్చ నడుస్తోంది. తాజా షెడ్యూల్లో పాటతోపాటు టాకీ పార్టును కూడా పూర్తి చేయనున్నట్టు టాక్. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రంలో సునీల్ (Sunil) అంజలి, జయరామ్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. వినయ విధేయ రామ చిత్రం తర్వాత రాంచరణ్, కియారా అద్వానీ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని