RT75 | ధమాకా క్రేజీ కాంబో రవితేజ (Raviteja), శ్రీలీల (Sreeleela) మరో సినిమా చేస్తుందని తెలిసిందే. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. రవితేజ బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ రవితేజ 75 (RT75)గా వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా ఇప్పటివరకు 40 శాతం చిత్రీకరణ పూర్తయినట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. కొన్ని రోజుల క్రితం రవితేజ ఆర్టీ 75 చిత్రీకరణలో భుజానికి గాయం కాగా.. డాక్టర్లు సర్జరీ చేశారు. సర్జరీ కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
కాగా రవితేజ ఎప్పుడు షూటింగ్లో జాయిన్ అవుతాడనేదానిపై ఆసక్తికర వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఆర్టీ 75 కొత్త షెడ్యూల్ అక్టోబర్ 14 నుంచి షురూ కానుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రవితేజ ఈ తేదీ నుంచే షూట్లో చేరబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. అంతేకాదు ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ఈ మూవీ సంక్రాంతి బరిలో ఉండటం లేదు. తాజా కథనాల ప్రకారం 2025 ఉగాదికి థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ చిత్రంలో రవితేజ ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
పేరు లక్ష్మణ భేరి.. ఆదాయం చెప్పను తియ్.. ఖర్చు లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం అన్ లిమిటెడ్..అవమానం జీరో అంటూ ఇప్పటికే సినిమాలో రవితేజ పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చి క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్.
Mammootty | షూటింగ్ టైం.. లొకేషన్లో జైలర్ విలన్‌తో మమ్ముట్టి
Anushka Shetty | అనుష్క వెడ్డింగ్‌కు వేళాయె.. క్రేజీ వార్తలో నిజమెంత..?
Pooja hegde | విజయ్‌తో రొమాన్స్ వన్స్‌మోర్.. దళపతి 69 హీరోయిన్ ఫైనల్..!
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !