Khiladi movie | కరోనా వైరస్ కారణంగా చాలావరకు సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అందులో పెద్ద సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రెండు నెలల వరకు సినిమాలు విడుదల కావడం అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా తన సినిమా మాత్రం విడుదల చేయడం ఖాయం అంటున్నాడు రవితేజ. ఈయన నటిస్తున్న ఖిలాడి సినిమా అనుకున్న సమయానికి విడుదల కానుంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఫామ్ లోకి రావడానికి ఒక్క హిట్ చాలు. ఆ ఒక్క విజయం వచ్చిందంటే.. ముందు వచ్చిన ఫ్లాపులు అన్నీ మరిచిపోతారు. రవితేజ విషయంలోనూ ఇదే జరుగుతుంది.
కరోనా మహమ్మారి తర్వాత 2021 సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో రూ.38 కోట్ల షేర్ వసూలు చేసింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. క్రాక్ తర్వాత రవితేజ మార్కెట్ ట్రాక్ ఎక్కింది. అందుకే రాబోయే సినిమాలకు సంబంధించిన బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. ప్రస్తుతం ఆయన రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ చిత్రం కోసం రవితేజ 10 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఓటీటీలో ఏకంగా రూ.40 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కుల కోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది. రూ.40 కాకపోతే 45 అయిన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ సినిమాను మాత్రం థియేటర్లో విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని మరోసారి అధికారికంగా ప్రకటిస్తూ యూఎస్ ప్రీమియర్ ఫిబ్రవరి 10వ తేదీ అని కన్ఫమ్ చేశారు నిర్మాతలు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి కరోనా సమయంలో రాబోయే ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR New release date | ట్రిపుల్ ఆర్ నుంచి సర్ప్రైజ్.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనంట!!
Pawan kalyan | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఊహించని సమస్య..
Vijay devarakonda | లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలు ఇవే..
Kiran Abbavaram | ఆ కుర్రాడిలో విషయం ఉంది.. దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం..