రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చేస్తూ బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మే 9న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ సినిమా తర్వాత రవితేజ చేసే సినిమా ఏది? అనే విషయంపై ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి వంటి క్లాస్ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల కథను రవితేజ ఓకే చేశారని ఈ వార్త సారాంశం. బేసిగ్గా కిశోర్ క్లాస్ డైరెక్టర్. రవితేజ మాస్ హీరో. మరి వీరిద్దరి కలయికలో రానున్న సినిమా ఏ జోనర్లో ఉంటుంది? అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.