Kishore Tirumala | టాలీవుడ్ యాక్టర్ రవితేజ కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. RT76 ప్రాజెక్టుగా ఈ మూవీలో ఆషికా రంగనాథ్, ఖిలాడి ఫేం డింపుల్ హయతి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా లాంచ్ చేసిన గ్లింప్స్, టీజర్ ఫన్ ఎలిమెంట్స్‌తో సాగుతూ మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాయి.
తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కిశోర్ తిరుమల ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. రవితేజ కిశోర్ తిరుమలకు కీలకమైన సలహా ఒకటి ఇచ్చాడట. ఈ విషయం గురించి కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతున్న సమయంలో రవితేజ తన ఇమేజ్‌పై ఫోకస్ పెట్టవద్దని.. నా స్టైల్లో (శైలి) తాజా ఫీల్ అందించే రచయిత యాంగిల్లో సాగే పాత్రపైనే దృష్టి పెట్టాలని చెప్పాడన్నాడు.
మేం రవితేజ సలహా మేరకు రామ్ సత్యనారాయణ (రవితేజ రోల్)పాత్రకు సహజసిద్దంగా ఉండేలా చూసుకుంటూనే.. మరోవైపు రవితేజ మార్క్ ఎలిమెంట్స్ కామెడీ, వినోదం మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రేక్షకులకు సంక్రాంతికి ఫుల్ వినోదాన్ని పంచుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్, సునీల్, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.