Bhartha Mahasayulaku Wignyapthi | కిశోర్ తిరుమల దర్శకత్వంలో టాలీవుడ్ యాక్టర్ రవితేజ నటిస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. RT76గా వస్తోన్న ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, ఖిలాడి ఫేం డింపుల్ హయతి ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుండగా.. శనివారం లాంచ్ చేసిన టీజర్ ఫన్ ఎలిమెంట్స్‌తో సాగుతూ మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది.
ఆదివారం ప్రెస్ మీట్లో నిర్మాత సుధాకర్ చెరుకూరి మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రానికి టికెట్ ధరల పెంపు ఉండదని.. సంక్రాంతి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని సాధారణ ధరలే ఉంటాయని చెప్పారు. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం బాగా కలిసి రానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టైటిల్ గ్లింప్స్‌లో భక్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇవాళ 10 : 30 నిమిషాలకు స్వామి వారి కళ్యాణం. అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందంటూ.. పంతులు వాయిస్ ఓవర్‌తో సాగే మాటలతో షురూ అయింది గ్లింప్స్. అనంతరం ఈ అనౌన్స్మెంట్ మనలో చాలా మంది చాలా సార్లు వినుంటాం. ఇప్పుడు నాకిది ఎందుకు గుర్తొచ్చిందంటే నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను.
గూగుల్, ఏఐ, జెమినీ, చాట్ జీపీటీ ఇలా అన్నింటిని అడిగాను. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా అయోమయానికి గురిచేశాయి అంటూ రవితేజ వాయస్ ఓవర్‌తో సాగుతున్న సంభాషణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.