Revolver Rita OTT | టాలీవుడ్ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన వైవిధ్యమైన యాక్షన్ ఎంటర్టైనర్ ‘రివాల్వర్ రీటా’. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా, డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. క్రిస్మస్ పండుగ ముగిసిన మరుసటి రోజు నుంచే కీర్తి సురేష్ యాక్షన్ హంగామా మొదలుకానుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి వస్తుండటం విశేషం.
ఈ సినిమాలో కీర్తి సురేష్ ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా కామెడీతో కూడిన మాస్ యాక్షన్ పాత్రలో మెరిశారు. ఒక సాదాసీదా అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో రివాల్వర్ పట్టి గ్యాంగ్స్టర్లతో ఎలా పోరాడింది, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొంది అనే ఆసక్తికర కథాంశంతో దర్శకుడు కె. చంద్రు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధాన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Apdi handbag la weapons irukura alavuku avanga yaaru? 🔫😱 pic.twitter.com/gD2dXvQxcx
— Netflix India South (@Netflix_INSouth) December 21, 2025