Matka | పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ మట్కా (Matka). పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా పుష్ప యాక్టర్ అజయ్ ఘోష్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన చిల్లప్ప రెడ్డి లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఈ మూవీలో మరో కీ రోల్ చేస్తున్న బొమ్మాళి రవిశంకర్ లుక్ విడుదల చేశారు. ఓల్డ్ మ్యాన్ లుక్‌లో ఉన్న రవిశంకర్ కుడిచేతిలో తుపాకీ, ఎడమ చేతిలో పిస్తోల్ పట్టుకున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇంతకీ రవిశంకర్ ఇలా రెండు గన్స్ పట్టుకోవడానికి కారణమేంటనేది సస్పెన్స్‌లో పెట్టేశాడు డైరెక్టర్. ఈ లుక్‌తో సినిమాపై హైప్ పెంచేస్తుంది వరుణ్ తేజ్ టీం.
వరుణ్ తేజ్ సూట్ వేసుకుని డిఫరెంట్ స్టైల్స్‌లో కనిపిస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాడు. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్, నోరా ఫతేహి అండ్ టీంపై వచ్చే లే లే రాజా పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు మేకర్స్. ఈ సాంగ్ కలర్ఫుల్గా సాగుతూ సినిమాకు హైలెట్‌గా నిలువబోతుందని మట్కా.. బి హైండ్ ది గేమ్.. యాక్ట్ 2 చెప్పకనే చెబుతోంది.
Tough, Ruthless & Shrewd Jailer 🔥
Presenting #RaviShankar as ‘Narayana Murthy’ from #MATKA 🤩
IN THEATERS WORLDWIDE ON NOVEMBER 14, 2024 💥#MATKAonNOV14th
Mega Prince @IamVarunTej @KKfilmmaker @Meenakshiioffl #NoraFatehi @gvprakash @kishorkumardop @karthikaSriniva… pic.twitter.com/w1M97mSQgj— BA Raju’s Team (@baraju_SuperHit) October 29, 2024
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..