అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) . ఈ క్రేజీ డైరెక్టర్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ తో ఎనిమిల్ (Animal) సినిమా చేస్తున్నాడు. యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్టులో స్పెషల్ సాంగ్ ఉండగా.. నేషనల్ క్రష్ రష్మికమందన్నా ఈ సాంగ్‌లో స్టెప్పులేయనుందన్న వార్త ఇపుడు బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే పుష్ప సినిమాలో శ్రీవల్లిగా డీగ్లామరైజ్డ్ పాత్రలో జీవించేసి..కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించింది. రష్మిక మందన్నా (Rashmika mandanna) చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతోపాటు మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలలో నటిస్తోంది.
ఇప్పటివరకు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ స్టార్ స్టేటస్‌తో బిజీగా ఉన్న రష్మిక మరి స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తుందా..? లేదా అనేది చూడాలి.