టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్లలో ప్రయోగాత్మక చిత్రాలు చేసే వారిలో టాప్ ప్లేస్ లో ఉంటుంది చెన్నై సుందరి సమంత (Samantha). ఈ భామ నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ ప్రాజెక్టులతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తోంది. ప్రస్తుతం ఫీ మేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్టు యశోదతోపాటు పాపులర్ అమెరికన్ సిరీస్ ఆధారంగా తెరకెక్కుతున్న సిటడెల్ (Citadel) వెబ్ సిరీస్ చేస్తోంది.
ఈ భామ ఇటీవలే బాలీవుడ్ (Bollywood) యువ నటుడు వరుణ్ ధవన్ (Varun Dhawan) తో కలిసి ముంబైలో కనిపించింది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ లో వరుణ్ ధవన్, సమంత కీ రోల్స్ పోషిస్తున్నారు. తాజాఅప్ డేట్ ఏంటంటే ఈ సిరీస్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాల కోసం సమంత ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటుందట. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో తన యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలుఅందుకున్న సామ్..తన బోల్డ్ ఫర్మ ఫార్మెన్స్ తో అవార్డులను సైతం అందుకుంది.
ఇక తాజాగా చేస్తున్న వెబ్ ప్రాజెక్టుతో సమంత మళ్లీ ఫాంలోకి రావడంతోపాటు మంచి సక్సెస్ ను అందుకోవడం ఖాయమని ధీమాగా ఉన్నారు సామ్ ఫాలోవర్లు,అభిమానులు. మొత్తానికి ఇటీవలే పుష్ప లో ఊ అంటావా ఊఊఅంటావా పాటలో హాట్ హాట్ స్టెప్పులతో అదరగొట్టిన సామ్..మళ్లీ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.