బాలీవుడ్ భామ అనుష్క శర్మ (Anushka Sharma) పెళ్లయిన తర్వాత షూటింగ్‌కు దాదాపు దూరమైంది. 2021 జనవరిలో అనుష్క పండటి పాపాయికి జన్మనించింది. ఆ పాపకు వామికా కోహ్లీగా నామకరణం కూడా చేశారు. కూతురు పుట్టి ఏడాది దాటి పోతుంది. అనుష్క పెళ్లి, పిల్లల కారణంగా సిల్వర్ స్క్రీన్కు దూరమై సుమారు 3 ఏండ్లు అవుతుంది. తాజాగా ఈ భామ గ్రాండ్ కమ్ బ్యాక్ కు రెడీ అవుతోంది.
జులన్ గోస్వామి బయోపిక్ (Jhulan Goswami biopic) చక్డా ఎక్స్‌ప్రెస్ (Chakda Xpress)తో మళ్లీ వినోదాన్ని అందించేందుకు రెడీ అంటోంది అనుష్క . క్రికెటర్ పాత్ర కావడంతో గత కొన్ని రోజులుగా ట్రైనింగ్ తీసుకుంటోంది. మైదానంలోకి దిగిబ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడుతున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజా సినిమా షూటింగ్ కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తోంది అనుష్క.
Grip by grip 💙🏏#prep #ChakdaXpress@NetflixIndia @JhulanG10 @OfficialCSFilmz @prosit_roy #KarneshSsharma pic.twitter.com/IyDDfWGQH0
— Anushka Sharma (@AnushkaSharma) February 25, 2022
స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని ఫ్లోరల్ డిజైన్డ్ టీ షర్ట్‌లో క్రికెట్ ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మరి అనుష్క సిల్వర్ స్క్రీన్‌పై స్టార్ క్రికెటర్ అయిన తన భర్త విరాట్ కోహ్లీని మరిపిస్తుందేమో చూడాలి.