పెళ్లయితేనేం తనలో ఏ మాత్రం ఛరిష్మా తగ్గలేదంటోంది బాలీవుడ్ (Bollywood) భామ కత్రినాకైఫ్ (Katrina Kaif). సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కత్రినాకైఫ్ ఎప్పటికపుడు తన అప్డేట్స్ ను పోస్ట్ చేస్తూ అందరిలో జోష్ నింపుతుంటుంది. ఈ బ్యూటీ తాజా ట్రాపికల్ ప్రింట్ కో ఆర్డ్ సెట్ లో బీచ్ వేర్ లుక్‌లో తళుక్కుమంటోంది. బ్యాక్ డ్రాప్ లో సముద్రం కనిపిస్తుండగా..ఫ్లోరల్ ప్రింటెండ్ గ్రీన్ టాప్, స్కర్ట్‌లో మెస్మరైజ్ చేస్తోంది.
గెహ్రియాన్ స్టార్ ధైర్య కార్వతో కలిసి స్లైస్ యాడ్ (Slice beverage ad) లో నటించింది కత్రినా. వైబ్రాంట్ కలర్, ట్రెండీ కాస్ట్యూమ్స్ కేరాఫ్ గా నలిచే సాక్షా అండ్ కిన్ని డిజైనర్ లేబుల్ లో కనిపిస్తున్న కత్రినా.. చేతిలో స్లైస్ బాటిల్ పట్టుకుని హొయలు పోతూ కెమెరా స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ భామ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
గతేడాది కోస్టార్ విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయి కొంతకాలమే అయినా హనీమూన్ లాంటి ప్లాన్స్ ఏం పెట్టుకోకుండా సినిమాలు, యాడ్ షూటింగ్స్ తో బిజీ అయిపోయారు విక్కీ-కత్రినా.