Thamma | మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ తెరకెక్కించిన హార్రర్ మూవీస్‌కు సూపర్ క్రేజ్ ఉంటుందని తెలిసిందే. ఇదే జోనర్లో రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా కాంబోలో దీపావళి సీజన్లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ చిత్రం థామా (Thamma). మ్యాడ్‌డాక్ హార్రర్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
తెలుగులో కూడా డబ్బింగ్ అయిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత థామా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో ఇటీవలే రెంటల్ బేసిస్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఇక ఉచితంగా చూసేయొచ్చు. థామా అమెజాన్ సబ్ స్క్రైబర్లకు (రెంటల్ ఫ్రీ) ఉచితంగా అందుబాటులో ఉంది. హిందీ, తెలుగు ఆడియోతోపాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వీక్షించవచ్చు. ఇంకేంటి మరి థామాపై ఓటీటీలో ఓ లుక్కేయండి మరి.
ఆదిత్య సర్పోట్దర్ డైరెక్టర్ చేసిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సచిన్-జిగర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మలైకా అరోరా, నోరా ఫతేహి, వరుణ్ ధవన్ కామియో రోల్స్‌లో నటించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేని సినిమాలకు ఓటీటీలో మంచి స్పందన వస్తుంటాయని తెలిసిందే. మరి థామా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
#Thamma (Hindi)
Now streaming on Primevideo in Hindi & Telugu 🍿!!#OTT_Trackers pic.twitter.com/XiCHPO15ZE
— OTT Trackers (@OTT_Trackers) December 16, 2025
45 Official Trailer | శివన్న – ఉపేంద్రల మెగా మల్టీస్టారర్.. ’45’ ట్రైలర్ విడుదల