India AI Impact Summit | ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ప్రస్తుతం ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమ్మిట్లో ఇండియాకు చెందిన గల్గోటియాస్ యూనివర్శిటీ (Galgotias University) ప్రదర్శించిన ఒక రోబోటిక్ డాగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసింది. ఈ సదస్సులో యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ నేహా సింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ‘ఓరియన్’ అనే పేరు గల ఒక రోబోను తమ యూనివర్శిటీలోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ లో స్వయంగా అభివృద్ధి(Develop) చేశామని గర్వంగా ప్రకటించారు. ఇది క్యాంపస్లో నిఘా(Surveillance) పనుల కోసం ఉపయోగపడుతుందని, AI రంగంలో తాము రూ. 350 కోట్ల భారీ పెట్టుబడి పెట్టామని వెల్లడించారు. అయితే, ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు నిజం బయటపడింది. ఆ రోబో గల్గోటియాస్ తయారు చేసింది కాదని చైనాకు చెందిన Unitree Robotics కంపెనీ తయారు చేసిన Unitree Go2 మోడల్ అని టెక్ నిపుణులు ఆధారాలతో సహా నిరూపించారు. కేవలం ఒకటిన్నర నుంచి రెండున్నర లక్షల రూపాయలకే ఆన్లైన్లో లభించే చైనా రోబోపై తమ యూనివర్శిటీ లోగో వేసి, సొంతంగా తయారు చేశామని అబద్ధాలు చెప్పడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగుతుండడంతో యూనివర్శిటీ యాజమాన్యం వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ.. ‘తాము ఆ రోబోను తయారు చేశామని ఎప్పుడూ చెప్పలేదని, కేవలం విద్యార్థుల అభ్యాసం కోసం చైనా నుంచి కొనుగోలు చేశామని సమర్థించుకుంది’. కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్వయంగా కెమెరా ముందు ‘మేమే డెవలప్ చేశాం’ అని చెప్పిన వీడియోలు స్పష్టంగా ఉండటంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వేరే దేశపు టెక్నాలజీని తమదిగా చెప్పుకుంటూ ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని, ఇలాంటి చర్యలు ఇండియా గౌరవాన్ని తగ్గిస్తాయని నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
JUST IN:
An Indian university presents the Chinese robot Unitree Go2 as their own innovation at the AI Summit in Delhi.pic.twitter.com/facktSieyb
— China pulse 🇨🇳 (@Eng_china5) February 17, 2026
— Galgotias University (@GalgotiasGU) February 17, 2026