గిర గిరగిర గింగిరాగిరే.. పాతాళంలోకి రూపాయి
రూపాయి పాతాళంలోకి పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు మొదలైనప్పటి నుంచి వేగంగా క్షీణిస్తున్న రూపాయి మారకం విలువ సోమవారం భారీగా పతనం చెందింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 95 మార్క్‌ను అధిగమించింది.
- ఇంట్రాడేలో 95కు పడిపోయిన విలువ
- చివర్లో 15 పైసలు పెరిగి 94.70 వద్ద ముగింపు
న్యూఢిల్లీ, మార్చి 30: రూపాయి పాతాళంలోకి పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు మొదలైనప్పటి నుంచి వేగంగా క్షీణిస్తున్న రూపాయి మారకం విలువ సోమవారం భారీగా పతనం చెందింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 95 మార్క్‌ను అధిగమించింది. ఇంట్రాడేలో 95.22 కనిష్ఠాన్ని తాకిన రూపాయి విలువ ఈ పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి రిజర్వుబ్యాంక్రంగంలోకి దిగడంతో చివర్లో 15 పైసలు ఎగబాకి 94.70 వద్ద ముగిసింది. 165 పైసల శ్రేణిలో కదలాడిన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు వరుసగా 31 రోజులుగా పతనం చెందుతూనే ఉన్నది.
రిజర్వుబ్యాంక్ ప్రతీరోజూ ట్రేడింగ్ ముగింపు నాటికి ఆన్‌షోర్ మార్కెట్లో బ్యాంకులు 100 మిలియన్ డాలర్ల వరకే ఓపెన్ పొజిషన్లు ఉంచుకునేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఫారెక్స్ మార్కెట్ ప్రారంభంలో 128 పైసలు లాభపడి 93.57కి చేరుకున్నది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ 4 శాతానికి పైగా పతనం చెందింది. మార్చి 27న 94.82 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల అంశాలు రూపాయి పతనాన్ని ఎగదోశాయి. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 115 డాలర్ల వద్దకు చేరుకోవడం రూపాయి పతనానికి ఆజ్యంపోశాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. ముడి చమురు పెరగడంతో దిగుమతుల భారం మరింత పెరుగుతున్నదన్న అంచనాతో మదుపరులు ఆందోళనకు గురయ్యారు.
2025-26లో 10 శాతం డౌన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూపాయికి అచ్చిరాలేదు. ఈ ఏడాది ఏకంగా రూపాయి విలువ 10 శాతం వరకు నష్టపోయింది. గడిచిన 14 ఏండ్లలో ఇదే అతిపెద్ద పతనం కావడం విశేషం. 2011-12లో అత్యధికంగా 12.4 శాతం పడిపోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురికావడం, ద్రవ్య లభ్యత పరిస్థితులు మరింత కఠినతరం కావడం రూపాయి పతనానికి ఆజ్యంపోసింది. కరెన్సీ పతనానికి అడ్డుకట్ట వేయడానికి రిజర్వుబ్యాంక్ గత మూడు నెలల్లో 55.073 బిలియన్ డాలర్లను విక్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కారణాలు
- పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు
- అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమనడం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

