Rashmika mandanna first look from Pushpa | పుష్ప సినిమా ప్రమోషన్ అంతా ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ లుక్ విడుదల చేశారు. ఒకటి కాదు రెండుసార్లు బన్నీకి సంబంధించిన లుక్స్ విడుదలయ్యాయి. గతేడాది బన్నీ పుట్టిన రోజున పుష్ప ఫస్ట్ లుక్ విడుదలైంది. అలాగే ఈ పుట్టిన రోజున టీజర్ విడుదల చేశారు. అందులో కేవలం అల్లు అర్జున్ను మాత్రమే ఫోకస్ చేశారు. ఈ మధ్యే ఫహాద్ ఫాజిల్ లుక్ కూడా విడుదలైంది. హీరో, విలన్ లుక్స్ అయిపోయాయి.. ఇప్పుడు హీరోయిన్ రష్మిక మందన లుక్ బయటికి రానుంది. సెప్టెంబర్ 29న రష్మిక ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు చిత్ర యూనిట్. ఉదయం 9.45 నిమిషాలకు రష్మిక ఫస్ట్ లుక్ విడుదల కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇదివరకు తన సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా నటించే స్కోప్ ఇచ్చేవాడు కాదు సుకుమార్. కానీ ఇప్పుడు మారిపోయాడు. రంగస్థలం నుంచి మనసు మార్చుకున్నాడు. అందుకే పుష్పలో రష్మిక మందన్న కారెక్టర్ కూడా చాలా బలంగా రాసుకున్నాడు. శ్రీవల్లి పాత్రకు ప్రాణం పోస్తుంది ఈ భామ. ఇప్పటివరకు కేవలం గ్లామర్ క్యారెక్టర్స్ మాత్రమే చేసుకుంటూ వచ్చిన రష్మిక.. పుష్పలో మాత్రం పూర్తిగా డీ గ్లామరైజ్డ్ గా కనిపిస్తుంది. ఇందులో అల్లు అర్జున్ భార్యగా కనిపించబోతోంది రష్మిక. సినిమా అంతా రాయలసీమ నేపథ్యంలోనే సాగనుంది. ఇందులో చిత్తూరు యాస మాట్లాడనున్నారు అల్లు అర్జున్, రష్మిక మందన. వాళ్లతో పాటు అనసూయ భరద్వాజ్, సునీల్ కూడా చిత్తూరు యాస మాట్లాడుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లో కనిపించిన ఒక్క షాట్లో పూర్తిగా డీ గ్లామర్ లుక్ లోనే ఉంది.
Raw & Intense Look of @iamRashmika is all set to amaze you!
— BA Raju's Team (@baraju_SuperHit) September 28, 2021
Meet #Pushpa's Love tomorrow at 9:45 AM #PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie @MythriOfficial pic.twitter.com/xvSA56iTVH
తమ హీరోయిన్ను సుకుమార్ పట్టించుకోవడం లేదంటూ రష్మిక ఫ్యాన్స్ గొడవ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే కేవలం రష్మిక పాట మాత్రమే విడుదల చేయబోతున్నారు. సినిమాలో ఈమెపై ప్రత్యేకంగా ఓ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తుంది. నారప్ప సినిమాలో ప్రియమణి మాదిరి రష్మిక పాత్ర ఉంటుందని తెలుస్తోంది. చిత్తూరు మాండలికం మాట్లాడే సాధారణ గృహిణిగా రష్మిక మందన్న కనిపించబోతుంది. అంతే కాదు అల్లు అర్జున్, రష్మిక మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని.. ఇది వరకు సినిమాల్లో చూడని విధంగా వీటిని సుకుమార్ డిజైన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్రిస్మస్ సందర్భంగా పుష్ప మొదటి భాగం విడుదల కానుంది. ఖచ్చితంగా తన కెరీర్లో పుష్ప ఒక ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుందని చాలా నమ్మకంగా చెబుతుంది రష్మిక మందన. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కు పుష్ప: ది రైజ్ సినిమా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కల్యాణ్‌పై మరోసారి ఫైర్ అయిన పోసాని.. చిరంజీవిని పొగుడుతూనే..
మీరు నవ్వితే ప్రపంచం ఆగిపోతుంది..దీపికాపదుకొనే స్టిల్‌పై అభిమాని
తండ్రి, కొడుకుల మధ్య ముదురుతున్న వివాదం.. ఆందోళనలో విజయ్ ఫ్యాన్స్
మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ అంతా నాకే ఓటేస్తారు: మంచు విష్ణు
Pawan Kalyan: దసరాకి పట్టాలెక్కనున్న భవదీయుడు భగత్ సింగ్..!
Rashmika mandanna first look from pushpa to be release on tomorrow