Vijay: తండ్రి, కొడుకుల మధ్య ముదురుతున్న వివాదం.. ఆందోళనలో విజయ్ ఫ్యాన్స్

తమిళ స్టార్ హీరో విజయ్, ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇద్దరి మధ్య వివాదం రోజురోజుకు ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవల విజయ్ అనుమతి లేకుండా తన పేరు వాడుకుంటున్నారంటూ.. తన తల్లితండ్రులతో పాటు మరి 11 మందిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తమిళనాట సంచలనంగా మారింది. తన తల్లితండ్రులు విజయ్ పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని.. తన పేరు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా దళపతి విజయ్‌కు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ షాక్ ఇచ్చారు. ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ను రద్దు చేసినట్టు ప్రకటించారు. ఈ పరిణామాలతో తండ్రి, తనయుడి మధ్య వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది. ఎస్ఏ చంద్రశేఖర్ 2020లో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. తన పేరు ఉపయోగించుకుని కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించాలని విజయ్ ఇటీవల చెన్నై హక్కుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ జరిగింది. ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ను రద్దు చేసినట్టు చంద్రశేఖర్ సమాధాన పిటిషన్ దాఖలు చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

