ఎవరినీ చిన్నచూపు చూడకూడదు
జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, ఎవరినీ చిన్నచూపు చూడకూడదని హైకోర్టు న్యాయమూర్తులు విజయ్‌సేన్ రెడ్డి, చలపతిరావు సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు.
- న్యాయవాదులు సోషల్ ఇంజినీర్లు
- హైకోర్టు న్యాయమూర్తులు విజయ్‌సేన్‌రెడ్డి, చలపతిరావు
- తూప్రాన్‌లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనం ప్రారంభం
తూప్రాన్, నవంబర్ 24 : జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, ఎవరినీ చిన్నచూపు చూడకూడదని హైకోర్టు న్యాయమూర్తులు విజయ్‌సేన్ రెడ్డి, చలపతిరావు సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. యువ లాయర్లు సోషల్ మీడియాలో పబ్లిసిటీపై ఆధారపడుతున్నారని, నిజాయితీతో పనిచేస్తే పబ్లిసిటీ అవసరం లేదని, పేరు దానంతటదే వస్తుందని చెప్పారు. కోర్టులో న్యాయమూర్తుల కన్నా న్యాయవాది పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. న్యాయవాదులు సోషల్ ఇంజినీర్స్ అని, ఆకాశమే హద్దుగా నిరంతరం సాధనలో ఉండాలని సూచించారు.
మెదక్ జిల్లా న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ.. కక్షిదారుల సౌకర్యం, సత్వర సేవల కోసం కోర్టును ఏర్పాటు చేశామని, తూప్రాన్ పరిసర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్, జిల్లా న్యాయమూర్తులు సాయిసిరి సౌజన్య, హేమలత, శుభవల్లి, సంతోష్‌కుమార్, మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, తూప్రాన్ ఆర్డీవో బావయ్య, డీఎస్పీ నరేందర్‌గౌడ్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో శాలిక, మన్సిపల్ చైర్పర్సన్ రజిని, కమిషనర్ రమేశ్‌కుమార్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

