Rashmika in Pushpa | అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు ఇండస్ట్రీ మొత్తం పుష్ప సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కరోనాతో సందిగ్ధంలో పడిన థియేటర్లకు మునపటిలా జనం వస్తున్నారని అఖండ సినిమాతో కన్ఫర్మ్ చేశాడు బాలయ్య. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ అద్భుత విజయం సాధించడమే కాకుండా.. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అఖండ ఇచ్చిన ఊపుతో పుష్ప సినిమా కూడా రిలీజ్‌కు సిద్ధమైంది. ఇలాంటి సమయంలో పుష్ప సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటే వచ్చే కలెక్షన్స్ మామూలుగా ఉండవు. ఇదిలా ఉంటే సినిమాలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయని ఇప్పటికే పదే పదే చెప్తున్నాడు దర్శకుడు సుకుమార్. పైగా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ సునీల్, అల్లు అర్జున్ ఇదే చెప్పారు. ఇక రష్మిక మందన్న అయితే తన కోసం కూడా సినిమాకు వచ్చే ఫ్యాన్స్ ఉంటారని చెప్పుకొచ్చింది.
సినిమాలో తన కారెక్టర్ అలా ఉంటుందని అంచనాలు పెంచేసింది. అయితే ఇప్పుడు కొన్ని షాకింగ్ నిజాలు బయటికి వస్తున్నాయి. అసలు పుష్ప మొదటి భాగంలో శ్రీవల్లి అంటే రష్మిక మందన్న క్యారెక్టర్ తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్తూ కాస్త కన్నింగ్ గా ఉంటుందని అసలు విషయం బయటపెట్టింది రష్మిక. అంతేకాదు.. ఈ సినిమాలో రష్మిక పాత్ర చిన్నగానే ఉంటుందని.. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెండో భాగానికి టీజర్లా ఉంటుందని చెప్పింది. అంటే బాహుబలి మొదటి భాగంలో అనుష్క మాదిరి అన్నమాట. రెండో భాగం అంతా శ్రీవల్లి విశ్వరూపం చూస్తారని తెలుస్తుంది.
అసలు శ్రీవల్లిని రెండో భాగంలో చూస్తారని ఇఫ్పటికే చెప్పేసింది ఈ భామ. అంటే తొలి భాగంలో రష్మిక పాత్ర చివర్లో వస్తుందా లేదంటే తక్కువగా ఉంటుందా అనేది అర్థం కావడం లేదు. ఒకవేళ మొదటి భాగంలో రష్మిక కానీ కనిపించకపోతే కుర్రాళ్ల గుండెలు బద్ధలైపోతాయి. పాటలు, ట్రైలర్ సీన్స్ చూస్తుంటే మాత్రం బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఇప్పుడు రష్మిక మాటలు వింటుంటే మాత్రం అలాంటిదేం లేదనట్లే అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాలో ఎంత ఉన్నా కూడా.. హీరోయిన్ లేకపోతే అదో తెలీని వెలితి అలాగే ఉండిపోతుందబ్బా..! దీనికి సమాధానం డిసెంబర్ 17న తెలియనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha | పుష్పలో సమంత ఐటెం సాంగ్‌పై రష్మిక రియాక్షన్ ఏంటి?
Rashmika Vs Samantha | సమంత ఎంట్రీతో రష్మికకు భయం పట్టుకుందా..?
తెలుగు ఓకే.. మిగిలిన భాషల్లో ప్రమోషన్ ఎక్కడ పుష్ప..?
Rashmika Preperation | తిరుపతిలోని ఓ గ్రామానికి వెళ్లిన రష్మిక..ఎందుకో తెలుసా..?
Kriti shetty in shyam singha roy Trailer | ముద్దులతో రెచ్చిపోయిన కృతి శెట్టి