Pushpa movie promotions | పాన్ ఇండియన్ సినిమా చేయడం ఈ రోజుల్లో ఈజీ.. కానీ దాన్ని ప్రమోట్ చేసుకోవడం చాలా కష్టం. సరిగ్గా ప్రమోట్ చేసుకోకపోతే ఉత్తరాది ప్రేక్షకులు కనీసం పట్టించుకోరు. కేవలం ప్రమోషన్ లోపంతోనే చిరంజీవి సైరా సినిమా బాలీవుడ్లో డిజాస్టర్‌గా నిలిచింది. హిందీలో ఈ సినిమాకు నామమాత్రపు వసూళ్లు కూడా రాలేదు. అలాగే మిగిలిన భాషల పరిస్థితి అంతే. కేవలం తెలుగులో మాత్రమే అద్భుతమైన వసూళ్లు తీసుకొచ్చింది.
నిజం చెప్పాలంటే బాహుబలి తర్వాత మరే తెలుగు సినిమా కూడా హిందీలో వసూళ్లు సాధించలేదు. సాహో సినిమా హిందీలో హిట్టైనా తెలుగులో ఫ్లాప్ అయింది. తాజాగా అల్లు అర్జున్ పుష్ప కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. బన్నీకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా తెలుగు, మలయాళంలో అద్భుతమైన ఓపెనింగ్స్ రావడం పక్కా. కానీ మిగిలిన భాషల పరిస్థితి ఏంటి అనేది అర్థం కావడం లేదు. సినిమా విడుదల మరో వారం రోజులు కూడా లేదు. కానీ ఇప్పటివరకు ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు కాలేదు. తెలుగులో సినిమాలు బాగానే ప్రమోట్ చేస్తున్నారు కానీ మిగిలిన భాషల పరిస్థితి ఏంటి అనేది అర్థం కాని చిక్కుప్రశ్న.
హిందీలో సరైన ప్రమోషనల్ ఈవెంట్ ఒక్కటి కూడా చేయలేదు. మరోవైపు తమిళనాట కూడా ఇదే పరిస్థితి. సరైన ప్రమోషన్ లేకపోతే ఎంత అద్భుతమైన సినిమా చేసినా కూడా ఫలితం శూన్యం అనే విషయం అల్లు అర్జున్ కు తెలియని విషయం కాదు. అయినా కూడా ఇప్పటివరకు పుష్ప ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. డిసెంబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది. అంటే కేవలం 5 రోజులు మాత్రమే బాలన్స్ ఉంది. మరి ఈ రానున్న 5 రోజుల్లో పుష్ప ప్రమోషన్స్ మిగిలిన భాషల్లో దర్శక నిర్మాతలు ఎలా ప్లాన్ చేయబోతున్నారో చూడాలి. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ వేరే లెవెల్‌కి వెళ్లిపోతాడు..!!: అజయ్
David Warner: వార్నర్ పుష్పరాజ్‌గా మారితే.. విరాట్, బన్నీ స్పందన ఏంటి?
Pushpa | అల్లు అర్జున్ పుష్ప సినిమాకు 250 కోట్ల బిజినెస్!
Samantha: సమంత మాస్ సాంగ్ ఆ సినిమా పాటకు కాపీనా?