David Warner: వార్నర్ పుష్పరాజ్‌గా మారితే.. విరాట్, బన్నీ స్పందన ఏంటి?

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గ్రౌండ్లోకి దిగాడంటే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఆయన ఒకవైపు క్రికెట్‌తో తన అభిమానులని అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో వైవిధ్యమైన వీడియోలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. కరోనా సమయంలో వార్నర్ తన భార్యతో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియోలతో ఫుల్‌గా ఫేమస్ అయిపోయాడు. తెలుగు, తమిళ హీరోల పాటలకు టిక్ టాక్ వీడియోలు చేసి అలరించాడు.
అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’లో క్యాండీ వార్నర్‌తో కలిసి ‘బుట్టబొమ్మ’.. మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’లో మైండ్ బ్లాక్ పాటలకు స్టెప్పులేసి తెలుగు అభిమానులకు మరింత దగ్గరయ్యాడు.తాజాగా ఫేస్ యాప్ ద్వారా బన్నీ నటించిన పుష్ప సినిమాలోని ‘యే బిడ్డా’ పాటను కూడా ఇమిటేట్ చేశాడు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘క్యాప్షన్ దిస్…’ అంటూ కామెంట్ పెట్టాడు.
పుష్పరాజ్ గెటప్ లో ఉన్న వార్నర్ భాయ్ ను చూసిన అభిమానులు… ‘కోకో కోలా పెప్సీ.. డేవిడ్ భాయ్ సెక్సీ..’, ‘వార్నర్ అంటే ఫైర్.. ఫ్లవర్ అనుకుంటివా..’‘నీ అవ్వ తగ్గేదేలే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వీరే కాదు, విరాట్ కోహ్లీ, బన్నీ కూడా ఈ వీడియోకి స్పందించారు. ‘నువ్వు ఓకే నా!’ అని విరాట్ కామెంట్ చేయగా… ‘కాస్త గొంతు పట్టేసినట్టుంది..’ అని వార్నర్ సరదాగా సమాధానం ఇచ్చాడు. దీనిని చూసిన అల్లుఅర్జున్ ‘‘ మై బ్రదర్ వార్నర్.. తగ్గేదేలే’’ అని కామెంట్ చేశాడు.
https://www.instagram.com/tv/CXVv7sbJU1X/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

