అందాల ముద్దుగుమ్మ సమంత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ లిరికల్ వీడియో శుక్రవారం సాయంత్రం విడుదలైంది. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సాగిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో రచ్చ చేస్తుంది. లంగా జాకెట్లో సమంత తన అందచందాలు ప్రదర్శిస్తూ కుర్రకారుకి కంటిపై కనుకు లేకుండా చేసింది. ఈ పాటని చంద్రబోస్ రాయగా, ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు.
పాటను సమంత గ్లామర్, దేవిశ్రీ సంగీతం ఒక ఎత్తైతే.. ఈ పాటని పాడిన ఇంద్రావతి చౌహన్ తన మత్తు వాయిస్ తో నెక్స్ట్ లెవల్ కి చేర్చింది. అయితే ఈ సాంగ్‌పై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన వీడొక్కడే సినిమాలోని హానీ.. హానీ పాటకి కాపీలా ఈ సాంగ్ ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు సాంగ్స్ ఒకేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.
ఇప్పటివరకు కెరీర్లో ఒక్కసారి కూడా స్పెషల్ సాంగ్స్ చేయని సామ్ మొదటిసారిగా బన్నీ కోసం ఐటెం భామగా మారిన విషయం తెలిసిందే. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన సమత ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి 30 లక్షల కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.