Pushpa | అల్లు అర్జున్ పుష్ప సినిమాకు 250 కోట్ల బిజినెస్!

Pushpa pre release business | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సంచలన దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్టు పుష్ప. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క ఫోటో, పోస్టర్, టీజర్, ట్రైలర్ అన్ని అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కేవలం తెలుగులో మాత్రమే కాదు మిగిలిన భాషల్లో కూడా పుష్ప సినిమా కంటెంట్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.
ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతుంది. ఒకటి రెండూ కాదు ఏకంగా 250 కోట్ల బిజినెస్ ఈ సినిమాకు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తొలిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా చేయడంతో ఈ బిజినెస్ సాధ్యమైందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అల వైకుంఠపురంలో వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో భారీ ధరలకు పుష్ప అమ్ముడైంది.
మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రంగంస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చేస్తున్న సినిమా పుష్ప ది రైజ్. అందుకే అన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్‌కు ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేశారు డిస్ట్రిబ్యూటర్లు. అన్నింటికీ మించి సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో వందల కోట్ల బిజినెస్ సాధ్యమైందని తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్.. అలాగే నాన్ థియేట్రికల్ (ఓటీటీ, డిజిటిల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో, హిందీ డబ్బింగ్ రైట్స్) కలుపుకొని పుష్ప బిజినెస్ 250 కోట్ల వరకు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పినట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప ది రైజ్ తగ్గేదేలె అనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha: సమంత మాస్ సాంగ్ ఆ సినిమా పాటకు కాపీనా?
Samantha special song | సమంత ఇకపై వరుసగా ఐటం సాంగ్స్ చేయబోతుందా..?
Oo Antava OoOo Antava | జిగేల్ రాణిని బీట్ చేసేలా పుష్పలో సమంత ఐటెం సాంగ్
Oo Antava OoOo Antava | పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ పాడింది మంగ్లీ చెల్లెనే.. ఈమె గురించి తెలుసా
pushpa censor talk | పుష్ప సెన్సార్ టాక్.. అల్లు అర్జున్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

