టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి భోళా శంకర్ (Bhola Shankar). మెహర్ రమేశ్ (Meher Ramesh) దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళమ్ రీమేక్‌గా వస్తుంది. చిరంజీవి చెల్లెలిగా కోలీవుడ్ బ్యూటీ కీర్తిసురేశ్ నటిస్తోండగా..టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannah) ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
చిరంజీవి సినిమాలో ప్రముఖ టీవీ యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam) అవకాశం కొట్టేసిందన్న వార్త టాలీవుడ్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. భోళా శంకర్‌లో రష్మి గౌతమ్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుందన్న న్యూస్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్నేహితురాలిగా, హీరోయిన్ పాత్రల్లో చిన్న సినిమాల్లో కనిపించిన రష్మీకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించే ఛాన్స్ ఎలా వచ్చిందనే దానిపై ఇపుడు సోషల్‌మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.
ఇంకో ఆసక్తికర విషయమేంటంటే స్పెషల్ సాంగ్ కోసం రష్మి పేరును స్వయంగా చిరంజీవి సూచించాడట. ప్రస్తుతానికి ఈ అప్డేట్ అఫీషియల్ కాకున్నా..చిరంజీవి సినిమాలో ఛాన్స్ వచ్చిందన్న వార్తను మాత్రం రష్మి తెగ ఎంజాయ్ చేస్తుంటుందని అనుకుంట్నారు సినీ జనాలు. చిరంజీవి ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తి చేశాడు. మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండిఇది కూడా చూడండి
ఇది కూడా చూడండి
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Katrina Vicky Kaushal wedding | జైపూర్ వెడ్డింగ్ కంటే ముందు మరో వెడ్డింగ్..!
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!