రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia bhatt) కాంబోలో వస్తున్న బాలీవుడ్ (Bollywood) ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) డైరెక్షన్లో మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్‌లో సందడి చేసింది రణ్‌బీర్ కపూర్ టీం. ఈ సందర్భంగా తన ఫేవరేట్ యాక్టర్ ఎవరో చెప్పగానే ఆడిటోరియం అంతా అరుపులు, కేకలతో మార్మోగిపోయింది.
ఇంతకీ ఆ క్రేజీ ఫేవరేట్ ఎవరో కాదు బాహుబలి స్టార్ ప్రభాస్. అంతేకాదు తనకు పవన్ కల్యాణ్ మ్యానిరిజం అంటే చాలా ఇష్టమని చెప్పి..అందరిలో జోష్ నింపాడు రణ్‌బీర్ కపూర్. స్టేజ్‌పై ప్రభాస్, పవన్ కల్యాణ్ పేర్లు చెప్పడంతో ఆనందంలో ఎగిరిగంతేశారు అభిమానులు.అన్ని దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. మూడు పార్టులుగా రాబోతుంది బ్రహ్మాస్త్ర.
ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), మౌనీరాయ్, టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.