టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ వేణు ఊడుగుల (Venu Udugula) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం (Virataparvam). తెలంగాణలో నక్సలిజం నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో రానా (Rana Daggubati), కోలీవుడ్ భామ సాయిపల్లవి (Saipallavi) హీరోహీరోయిన్లుగా నటిస్తోంది. విరాటపర్వం సినిమాలో కొన్ని చోట్ల వాడిన భాష కారణంగా ఈ చిత్రం చాలా మందికి కనెక్ట్ అవ్వద్దని, అందుకే నష్టాల బారిన పడకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయాలని నిర్మాత సురేశ్ బాబు (Suresh Babu) ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే ఇలా వార్తలు రావడంపై ట్విటర్ ద్వారా స్పందించాడు రానా. ‘దయచేసి ఈ భాషా సమస్యలపై నాకు అవగాహన కల్పించండి..ఏం టైం పాస్ గాళ్లు బ్రో మీరు’ అంటూ ట్వీట్ చేశాడు. విరాటపర్వం ఓటీటీ రిలీజ్ అంటూ నకిలీ వార్తను ట్వీట్ చేసిన ఓ మీడియా సంస్థను ట్యాగ్ చేస్తూ రానా చేసిన రీట్వీట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
కోలు కోలమ్మా కోలో సాంగ్..
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. విరాటపర్వంలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది.
Pls enlighten me on these language issues 😅😅 …..emi time pass gallu bro Meru !! 😂😂 https://t.co/pqcQKChQY3
— Rana Daggubati (@RanaDaggubati) November 10, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!