Rana Daggubati | రానా ‘సోలో’ సినిమాలపై ఆసక్తి చూపడం లేదా ..?
బాహుబలి ప్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ (Tollywood) హీరో దగ్గుబాటి రానా (Rana Daggubati). రానాకు సోలో హీరోగా మాత్రం నేనే రాజు నేనే మంత్రి చిత్రం మినహా మరే సినిమా ఆశించిన బ్రేక్ ఇవ్వలేకపోయాయి

బాహుబలి ప్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ (Tollywood) హీరో దగ్గుబాటి రానా (Rana Daggubati). అయితే లీడర్ తో హీరోగా కెరీర్ ప్రారంభించిన రానాకు సోలో హీరోగా మాత్రం నేనే రాజు నేనే మంత్రి చిత్రం మినహా మరే సినిమా ఆశించిన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఈ ఏడాది పాన్ ఇండియా స్టోరీతో తెరకెక్కిన అరణ్య ప్రాజెక్టుతో మళ్లీ సోలోగా ఎంట్రీ ఇచ్చిన రానాకు మార్కెట్ పరంగా అంతగా కలిసి రాలేదు.
ఈ నేపథ్యంలో రానా ఇకనుంచి ప్రయోగాలు చేయకుండా మల్టీ స్టారర్స్ సినిమాల (Multi Starrer Projects)పైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తోంది. సింగిల్ గా సినిమా చేసి ఆ ప్రాజెక్టు బాధ్యతను భుజాలపై మోసుకెళ్లే రిస్క్ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో కలిసి అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ గా వస్తున్న మల్టీ స్టారర్ ‘ భీమ్లా నాయక్’ లో నటిస్తున్నాడు రానా. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీని పవన్ కల్యాణ్ సినిమాగా చాలా మంది అనుకుంటున్నా..ఇది మాత్రం మల్టీస్టారర్. త్వరలో రానాకు సంబంధించిన పోస్టర్లను, వీడియోను రిలీజ్ చేసేందుకుప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు రానా బాబాయి వెంకటేశ్ తో కలిసి నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతోపాటు అక్కినేని నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇవికూడా చదవండి..
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

