Rana Daggubati | తెలుగులో చివరగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రానా (Rana Daggubati). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నిఖిల్ నటించిన స్పై చిత్రంలో కామియో రోల్లో నటించాడు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న వెట్టైయాన్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే రానా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
రానా నెక్ట్స్ హార్రర్ థ్రిల్లర్ ప్రాజెక్టులో నటించబోతున్నాడట. డెబ్యూ డైరెక్టర్ కిశోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. తాజా టాక్ ప్రకారం నవంబర్ 2024 నుంచి చిత్రీకరణ షురూ కానుంది. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కించిన ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. మాధ్యమిక బడ్జెట్‌తో రాబోతున్న ఈ మూవీ రానా హార్రర్ జోనర్లో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో సినీ జనాల్లో క్యూరియాసిటీ అంతకంతకూ పెరిగిపోతుంది.
Read Also :
Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో మహేశ్ బాబు కుటుంబం
Mr Bachchan | ప్రభాస్ అభిమానులకు రవితేజ మిస్టర్ బచ్చన్ టీం స్పెషల్ ట్రీట్.. !
Chiyaan Vikram | స్వేచ్చ కోసం చేసే పోరాటం.. తంగలాన్ గురించి చియాన్ విక్రమ్ ఏమన్నాడంటే..?