రాంగోపాల్‌వర్మ..సినీ పరిశ్రమలో లెజెండరీ యాక్టర్లతో సైతం అవలీలగా సినిమా తీయగల టాలెంట్ ఉన్న దర్శకుడు. అయితే ఈ డైరెక్టర్ మార్క్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి చాలా కాలమే అవుతుంది. కొన్నాళ్లుగా తన ఇమేజ్ కు సరిపడని సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఆర్జీవీ. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పెద్ద హీరోలెవరూ ఆర్జీవీతో పనిచేయడానికి సిద్దంగా లేరని టాక్.
అయితే తాజాగా చాలా కాలం తర్వాత ఆర్జీవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. వర్మ మరోసారి బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని టాక్. బిగ్ బీని మైండ్‌లో పెట్టుకుని ఆర్జీవీ ఓ కథ రాశాడట.
ఒకవేళ వర్మ ఆఫర్ కు బిగ్ బీ ఒకే చెబితే ఈ ప్రాజెక్టు 2022లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. గతంలో ఆర్జీవీ-అమితాబ్ కాంబోలో సర్కార్ ప్రాంఛైజీ, నిశబ్ద్, ఆర్జీవీ కి ఆగ్, రన్ అండ్ డిపార్ట్మెంట్ సినిమాలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి..
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!