RC 16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) గేమ్ ఛేంజర్ (Game Changer)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలువనుంది. కాగా రాంచరణ్ మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో RC16లో కూడా నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా దీపావళి విషెస్ తెలియజేస్తూ సరికొత్త వార్తను షేర్ చేశారు.
మీరందరూ జీవితంలో నూతనోత్తేజం, సంకల్పంతో అద్భుతమైన పండుగను జరుపుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. త్వరలోనే ఆర్సీ 16 ప్రయాణం మొదలవుతుందని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట రౌండప్ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇప్పటికే రాంచరణ్ బ్లాక్ టీ షర్ట్ అండ్ షార్ట్‌లో యెల్లో గ్రీన్ షూ వేసుకున్న చరణ్ ఫిట్నెస్ కోచ్ శివోహంతో ఉన్న స్టిల్‌ను షేర్ చేస్తూ బీస్ట్ మోడ్ ఆన్.. అంటూ షేర్ చేసిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్సీ 16లో తంగలాన్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏగన్ ఏకాంబరం (Aegan Ekambaram) కూడా జాయిన్ అవడంతో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
ఆర్సీ 16లో రాంచరణ్ ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఆర్సీ 16 చిత్రానికి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఆర్సీ 16 మేకర్స్ దీపావళి విషెస్..
Team #RC16 wishes everyone a very Happy Diwali 🪔
May you all have a wonderful festival with renewed grit and determination in life ❤🔥
The journey begins soon.#RamCharanRevolts
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/rxcKVoXKCj— BA Raju’s Team (@baraju_SuperHit) October 31, 2024
Lucky Baskhar Twitter Review | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్‌గా ఇంప్రెస్ చేశాడా..?
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే