టాలీవుడ్ (Tollywood)లో వస్తున్న మోస్ట్ పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ (RRR). రాంచరణ్ (Ramcharan), ఎన్టీఆర్ (Jr NTR) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ రాంచరణ్ ఎప్పుడు పాల్గొంటాడనే దానిపై క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. త్వరలోనే చెర్రీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ షురూ చేస్తాడని టాక్. తాజా సమాచారం ప్రకారం రాంచరణ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నాడు.
అప్పటి నుంచి సినిమా విడుదల వరకు ప్రమోషన్స్ పైనే తన ఫోకస్ అంతా పెట్టబోతున్నాడట. ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు ఆర్సీ 15 షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వనున్నాడని టాలీవుడ్ సర్కిల్ టాక్. ప్రస్తుతం రాంచరణ్ 15వ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇక విదేశీ పర్యటనలో ఉన్న ఎన్టీఆర్ ఈ నెల చివరికల్లా ఇండియాకు తిరిగొస్తాడట. అనంతరం ఆర్ఆర్ఆర్ టీం రాంచరణ్, రాజమౌళితో కలిసి ప్రమోషన్స్ లో బిజీ కానున్నాడని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా..ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్రలో కనిపించబోతున్నాడు. జక్కన్న టీం ఇప్పటికే విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీం పాత్రల గ్లింప్స్ వీడియోలు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టాయి.
ఇది కూడా చూడండి
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!