Ram charan and Pawan Kalyan Movie | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత బిజీలోనూ జనసేన కార్యక్రమాలు చక్కబెడుతూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు జనసేనాని. ఇదిలా ఉంటే ఇప్పుడు మూడో పడవ ప్రయాణం కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. కాకపోతే దానికి సమయం దొరకడం లేదు. ఆ మూడో పడవ ప్రయాణం పేరు సినిమా ప్రొడక్షన్. చాలా కాలంగా తన నిర్మాణంలో వరుసగా సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. కాకపోతే దానికి తగిన సమయం దొరకడం లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో ఒక బ్యానర్ స్థాపించాడు పవన్.
అందులో రెండు మూడు సినిమాలు కూడా చేశాడు. కాకపోతే అవి పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే కొన్నేళ్ల కింద సీరియస్గా తనకు సినిమాలు నిర్మించాలని ఉంది అంటూ ప్రకటించాడు పవన్. ఈ నేపథ్యంలో తన తొలి సినిమా అన్న కొడుకు రామ్ చరణ్ హీరోగా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే అది కేవలం ప్రకటనతోనే ఆగిపోయింది. తాజాగా బాబాయ్ నిర్మాణంలో తన సినిమా గురించి నోరు విప్పాడు రామ్ చరణ్. తనకు తానుగా వెళ్లి తనతో సినిమా నిర్మించమని ఎలా అడగను.. అది ఆయనకు అనిపించాలి అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఒక కథ కుదిరిన రోజు.. అది తనకు సరిపోతుంది అనుకుంటే పవన్ బాబాయ్ నిర్మాణంలో కచ్చితంగా సినిమా చేస్తాను అంటున్నాడు రామ్ చరణ్.
తమ కాంబినేషన్లో సినిమా మాత్రం కచ్చితంగా ఉంటుందని అనౌన్స్ చేశాడు ఈయన. అయితే అది ఎప్పుడూ ఉంటుంది అనేది మాత్రం క్లారిటీగా చెప్పలేదు. అలాగే తన నిర్మాణంలో కూడా పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేయాలని ఉందని చెప్పాడు చరణ్. దానికి సమాధానం కూడా కథ ఒకటే చెబుతుంది అంటున్నాడు. తగిన కథ దొరికినప్పుడు కచ్చితంగా బాబాయ్ తో సినిమా నిర్మిస్తానని కుండబద్దలు కొట్టాడు రామ్ చరణ్. ఈ రెండు సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు.
చరణ్ ఏడాదిలో ఎన్నిసార్లు అయ్యప్ప మాల వేస్తాడో తెలుసా..?
“ఆచార్య కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటున్న రామ్ చరణ్..”
“Acharya | ఇండియాలోని అతిపెద్ద సెట్లలో ధర్మస్థలి సెట్ ఒకటి :కొరటాల శివ”
KGF Chapter-2 | ‘కేజీఎఫ్-2’ చిత్ర బృందాన్ని అభినందించిన రామ్ చరణ్!”