Acharya | ఇండియాలోని అతిపెద్ద సెట్లలో ధర్మస్థలి సెట్ ఒకటి :కొరటాల శివ
Acharya dharmasthali Set | టాలీవుడ్ మెస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ఆచార్య’ ఒకటి. చిరంజీవి, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మొదటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపైన అంచనాలను రెట్టింపు చేశాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లలో పాల్గొంటూ ప్రతి రోజు ఏదో ఒక అప్డేట్ను ఇస్తూ ప్రేక్షకుల అటెన్షన్‌ను తిప్పుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘స్పిరిట్ ఆఫ్ ధర్మస్థలి’ అంటూ ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ వీడియోలో కొరటాల శివ ధర్మస్థలి గురించి పలు విషయాలను చెప్పాడు. ధర్మస్థలి అనే ఊరు అనుకున్న నుంచి గుళ్ళున్న ఊర్లను వెతకడం ప్రారంభించారని. కానీ శివ అనుకున్న దానికి అలాంటి ఊరు ఎక్కడ కనిపించకపోయేసరికి ధర్మస్థలి ఊరునే సెట్‌గా వేద్దాం అని భావించారట. దాంతో 20ఎకరాల్లో ధర్మస్థలి సెట్‌ను సురేష్ నిర్మించాడట. ఇండియాలోనే అంత పెద్ద సెట్ ఇప్పటివరకు ఎక్కడా నిర్మించలేదు అని కొరటాల శివ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డేలు కథానాయికలుగా నటించారు. మ్యాట్నీ ఎంటర్టైనమెంట్స్తో కలిసి రామ్‌చరణ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
All the hard work, devotion & vision behind building one of the India's Largest Set DHARMASTHALI.
Watch the #SpiritOfDharmasthali ft #KoratalaSiva.
– https://t.co/Sl9y4EmWK6#Acharya #Siddha#AcharyaOnApr29 pic.twitter.com/NIBQiku6Qb— Konidela Pro Company (@KonidelaPro) April 24, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

