KGF Chapter-2 | ‘కేజీఎఫ్-2’ చిత్ర బృందాన్ని అభినందించిన రామ్ చరణ్!
KGF Chapter-2 | ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘కేజీఎఫ్-2′ హవా నడుస్తుంది. నార్త్ నుంచి సౌత్ వరకు కలెక్షన్లలో రికార్డును సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక హిందీలో ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటివరకు బాలీవుడ్లో 280కోట్లకు పైగా సాధించి రికార్డు సృష్టించింది. ప్రశాంత్ నీల్ టేకింగ్, విజన్‌కు సినీప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. యష్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సినిమాను చూసి చిత్ర బృందాన్ని ప్రశంసించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన రామ్‌చరణ్ ట్విట్టర్లో చిత్ర బృందాన్ని ప్రశంసించాడు.
‘కేజీఎఫ్2′ విజయం సాధించినందుకు ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలింస్, టీం అందరికి శుభాకాంక్షలు. యష్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు. అతని స్క్రీన్ ప్రజెన్స్ అభినందనీయం. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావురమేష్ అద్భుతంగా నటించారు. శ్రీనిధి శెట్టి, ఈశ్వరీరావు, అర్చనజీయెస్, మాళవికలకు శుభాకాంక్షలు. రవిబస్రూర్ సంగీతం అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు నా అభినందనలు’ అంటూ ట్విట్టర్లో రామ్‌చరణ్ చిత్ర బృందాన్ని ప్రశంసించాడు. ఇక రామ్‌చరణ్ ప్రస్తుతం నటించి నిర్మించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

