ఆచార్య కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటున్న రామ్ చరణ్..
Ram charan Remuneration | ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమా విడుదల అవుతుంది అంటే అందరూ ముందుగా మాట్లాడుకునేది అందులో హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని..? ఎందుకంటే ఒక్కో సినిమాకు 50 నుంచి 100 కోట్ల వరకు పారితోషికం తీసుకునే హీరోలు మన దగ్గర ఉన్నారు. పైగా పాన్ ఇండియా మార్కెట్ వచ్చిన తర్వాత తీసుకునే రెమ్యునరేషన్ కూడా పెరిగిపోతుంది. నిర్మాతలు కూడా దీనికి ఓకే అంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఆచార్య లాంటి పెద్ద సినిమాకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు చిరంజీవి, రామ్ చరణ్. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం.
ఈ సినిమా కోసం ఈ ఇద్దరు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే దర్శకుడు కొరటాల శివ కూడా ఆచార్య కోసం ఎలాంటి పారితోషికం అందుకోలేదు. విడుదల తర్వాత జరిగే బిజినెస్లో.. వచ్చే కలెక్షన్స్ లో వాటా తీసుకోవాలని వీళ్లు నిర్ణయించుకున్నారు. అందుకే మేకింగ్ సమయంలో ఎలాంటి పారితోషికం అందుకోలేదని చెప్పాడు రామ్ చరణ్. ఈ సినిమాలో ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఆచార్య సినిమాను నిర్మించారు. పేరుకు రామ్ చరణ్ నిర్మాత అయిన కూడా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి అని దగ్గరుండి చూసుకున్నాడు.
ఓన్ ప్రొడక్షన్ కాబట్టి చరణ్, చిరంజీవి ఇద్దరు రెమ్యునరేషన్ తీసుకోలేదు. దీనికి సంబంధించిన ఖర్చు కూడా సినిమా బడ్జెట్పై పెట్టేశారు. నిజానికి తాను సొంత ప్రొడక్షన్ లో సినిమాలు చేసేది కూడా కేవలం క్వాలిటీ పెంచడానికి మాత్రమే అని.. అలా చేస్తే తన రెమ్యునరేషన్ ఉండదు కాబట్టి సినిమా ఇంకా క్వాలిటీగా వస్తుంది కావాల్సినంత ఖర్చు పెట్టొచ్చు అంటున్నాడు రామ్ చరణ్. ఆచార్య సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందని.. తనతో పాటు తండ్రి చిరంజీవి కూడా పారితోషికం తీసుకోలేదని చెబుతున్నాడు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో చేసే ఏ సినిమాకు కూడా పారితోషకం ఉండదు కాబట్టి.. బడ్జెట్ పరిమితులు కూడా ఉండవు అంటున్నాడు చరణ్. ఏదేమైనా ఈ రోజుల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించడం అంటే చిన్న విషయం కాదు. చిరంజీవి అంటే సొంత ప్రొడక్షన్ కాబట్టి తీసుకోలేదు.. ఇక్కడ దర్శకుడు కొరటాల కూడా డబ్బు తీసుకోలేదు అంటే నిజంగా గొప్ప విషయమే.
Read More :
“Ram Charan | నాన్న నన్ను హత్తుకున్నపుడు కన్నీళ్లొచ్చాయి : రాంచరణ్”
Acharya | ఇండియాలోని అతిపెద్ద సెట్లలో ధర్మస్థలి సెట్ ఒకటి :కొరటాల శివ”
Chiranjeevi | ఇండస్ట్రీ పెద్ద దిక్కు బాధ్యతపై మెగాస్టార్ చిరంజీవి ఒపీనియన్ ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

