Ram Charan | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ఆచార్య’ ఒకటి. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలకపాత్రలో నటించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మెగా అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా తండ్రీ కొడుకులను ఒకే తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎంతగానో ఎదురు చేశారు. ఎదురు చూపులకు ఫలితంగా చిరు, రామ్‌చరణ్ కలిసి ఒకేసినిమాలో నటించనున్నట్లు ప్రకటన రావడంతో అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఆచార్య షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలలై ట్రైలర్ సినిమాపై రెట్టింపు అంచనాలను నమోదు చేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జరుపుతుంది. తాజాగా శనివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ ఈవెంట్లో రామ్‌చరణ్ పలు ఆసక్తకర విషయాలను వెల్లడించాడు. ఆచార్య టీం అందిరికి ధన్యవాదాలు తెలుపుతూ తన తండ్రి మెగాస్టార్‌తో జరిగిన 20రోజల షూటింగ్లో చాలా విషయాలను నేర్చుకున్నానని తెలిపాడు. 20 సంత్సరాల నుంచి ఇంట్లో నేర్చుకున్న దానికంటే 20రోజుల షూటింగ్‌లోనే ఎక్కువ నేర్చుకున్నానని వెల్లడించాడు. ‘ఇండస్ట్రీలో ఎలా ఉండాలో నాన్న దగ్గరే నేర్చుకున్నా. నా లైఫ్‌లో డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు, వ్యాపారాలున్నాయి. కానీ ఇంత పేరు రావాలంటే మాత్రం సినిమా ఇండస్ట్రీతోనే సాధ్యం’ అంటూ సినీ రంగం గొప్పతనాన్ని తెలిపాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ సమయంలో అచార్యలో నటించడానికి ఒప్పుకున్న రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు. కొరటాల శివ సినిమాల్లో హీరోలకు మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అంటూ ప్రీ రిలీజ్లో వేడుకలో చెప్పుకొచ్చాడు.