Double ISMART | పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పూరీ టీం రిలీజ్ చేసిన ధిమాక్కిరికిరి డబుల్ ఇస్మార్ట్ టీజర్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది.
డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్..
ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి పనిచేస్తుండటంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.
Shivam Bhaje | గూస్బంప్స్ తెప్పించేలా శివం భజే.. డైరెక్టర్ అప్సర్పై నెటిజన్ల ప్రశంసలు
Veera Dheera Sooran | విక్రమ్, అరుణ్‌కుమార్ వీరధీరసూరన్ టీం విషెస్.. స్పెషల్ ఇదే..!
Malavika Mohanan | బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్‌లో మాళవిక మోహనన్