ఆదివారం 07 మార్చి 2021
Cinema - Dec 19, 2020 , 11:54:50

నా తల్లి, సోద‌రుడికి క‌రోనా అని తెలిసి చాలా భ‌య‌ప‌డ్డాను: రామ్

నా తల్లి, సోద‌రుడికి క‌రోనా అని తెలిసి చాలా భ‌య‌ప‌డ్డాను: రామ్

క‌రోనా మ‌హ‌మ్మారి సామాన్యుల‌నే కాదు సెల‌బ్రిటీల‌ని సైతం వ‌ణికిస్తుంది. ఇప్ప‌టికే క‌రోనాతో చాలా మంది సెల‌బ్రిటీలు తుది శ్వాస విడిచారు. క‌రోనా విష‌యంలో కాస్త అజాగ్ర‌త్త‌గా ఉంటే మూల్యం చెల్లించుకోక‌క తప్ప‌దు. అందుకే ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు త‌గు సూచ‌న‌లు చేస్తుంది. అయితే తాజాగా హీరో రామ్ తల్లి, సోద‌రుడు కృష్ణ చైత‌న్య క‌రోనా బారిన ప‌డ్డారు

త‌న త‌ల్లి, సోద‌రుడికి క‌రోనా సోకిన విష‌యం గురించి ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌తో మాట్లాడిన రామ్ .. నా ఫ్యామిలీలో ఇద్ద‌రికి క‌రోనా అని తెలిసి చాలా భ‌య‌ప‌డ్డాను.  ముఖ్యంగా నా సోద‌రుడికి క‌రోనాక సంబంధించి తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. అదృష్ట‌వ‌శాత్తు అత‌ను పూర్తిస్థాయిలో కోలుకోగ‌లిగాడు. టీకా వ‌చ్చే వర‌కు అంద‌రం జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది అని రామ్ పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం  అత‌ను రెడ్‌, థ్రిల్ల‌ర్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు .

VIDEOS

logo