RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన (Buchi Babu Sana) డైరెక్ట్ చేస్తున్న ఆర్సీ 16 (RC 16. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూట్ లొకేషన్ ఫొటో ఒకటి నెట్టింట షేర్ చేశాడు.
ఆర్సీ 16 సెట్స్‌లో కూతురు క్లింకారాను ఎత్తుకున్న స్టిల్ షేర్ చేస్తూ.. మై లిటిల్ క్యూట్ గెస్ట్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ లొకేషన్ ఎక్కడనేది పక్కన పెడితే తండ్రీకూతుళ్ల ఫొటోను చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. లొకేషన్ చూసిన అభిమానులు రంగస్థలం మేనియా రిపీట్ కాబోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. బుచ్చిబాబు టీం ఈ చిత్రానికి PEDDI అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిందని తెలుస్తుండగా.. దీనిపై త్వరలోనే అధికారికంగా టైటిల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీకపూర్ దేవర తర్వాత తెలుగులో నటిస్తోన్న రెండో సినిమా ఇది. ఆర్సీ 16 షూటింగ్‌ను జులై వరకు పూర్తి చేసి.. దసరా లేదా డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ మూవీకి తంగలాన్ ఫేం ఏగన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేస్తున్నాడు.
ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. రాంచరణ్ మరోవైపు సుకుమార్ డైరెక్షన్లో ఆర్సీ 17 ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ప్రస్తుతానికి అభిమానులు, మూవీ లవర్స్ ఫోకస్ అంతా బుచ్చి బాబు డైరెక్షన్లో చేస్తున్న సినిమాపైనే ఉంది.
“My Little Guest on set” 🩷
Idol @AlwaysRamCharan shares the Picture of the day with #KlinKaaraKonidela on #RC16 Sets. pic.twitter.com/ggnNiYmXTq
— Trends RamCharan ™ (@TweetRamCharan) February 5, 2025
Read Also :
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్