RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) ఇటీవలే గేమ్ ఛేంజర్ (Game Changer)తో ప్రేక్షకుల ముందుకు రాగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. రాంచరణ్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన (Buchi Babu Sana) డైరెక్షన్లో చేస్తున్న ఆర్సీ 16 (RC 16). స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
గతేడాది నవంబర్‌లో మైసూరులోని ఛాముండేశ్వరి మాత ఆశీస్సులతో సినిమా షూటింగ్‌ను మొదలుపెడుతున్నట్టు తెలియజేస్తూ డైరెక్టర్ బుచ్చి బాబు ఫొటో కూడా షేర్ చేసుకున్నాడు. ఈ షెడ్యూల్లో శ్రీరంగపట్టణ బెల్లం ఫ్యాక్టరీ, మైసూరుకు సమీపంలోని మేల్కొటే టెంపుల్లో వచ్చే సన్నివేశాలు చిత్రీకరించినట్టు సమాచారం.
తాజాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాంచరణ్ త్వరలోనే మూడో షెడ్యూల్లో జాయిన్ కాబోతున్నాడట. తాజా సమాచారం ప్రకారం జనవరి 27 నుంచి హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్ మొదలు కానుంది. జులైకల్లా షూటింగ్ పూర్తి చేసి.. దసరా లేదా డిసెంబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారని ఇన్సైడ్ టాక్.
అంతేకాదు ఆర్సీ 16 కథ కేవలం ఒక్క క్రీడ చుట్టే కాకుండా… మల్టిఫుల్ స్పోర్ట్స్ గురించి తెలియజేసేలా ఉండబోతుందని ఫిలింనగర్ సర్కిల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే నిజమైతే రాంచరణ్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.
ఈ చిత్రానికి తంగలాన్ ఫేం ఏగన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేస్తుండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు.
News is that #RamCharan is All Set to Join his 3rd Schedule of #RC16 from this Jan 27th in Hyd ! ❤️🔥
Targetting Release date in 2025 Second half 🥁🥁
BEAST MODE ON 🦁🔥@AlwaysRamCharan pic.twitter.com/z7EiKxDWaj
— Trends RamCharan ™ (@TweetRamCharan) January 20, 2025
Jailer Villain | మద్యం మత్తులో జైలర్ విలన్ వినాయకన్ వీరంగం.. ఇంతకీ ఏం చేశాడంటే..?
Jaat Movie | సన్నీడియోల్-గోపీచంద్ మూవీ కోసం ఏకంగా నలుగురు యాక్షన్ డైరెక్టర్లు.. !
Sankranthiki Vasthunam | ఓవర్సీస్లోనూ తగ్గేదేలే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం అరుదైన ఫీట్