Ayodhya – Ram Charan | రామ మందిరం కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నా : రామ్ చరణ్
Ram Charan | అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కోట్లాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లోనే అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు యావత్ భారతావణితో పాటు దేశం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు.
Ram Charan | అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కోట్లాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లోనే అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు యావత్ భారతావణితో పాటు దేశం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్య చేరుకున్నారు. భార్య సురేఖ, కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్య వెళ్లారు.
అయోధ్య చేరుకున్న అనంతరం రామ్‌చరణ్ (Ram Charan) మీడియాతో మాట్లాడారు. రామ మందిరం కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఈ మహత్తర కార్యంలో భాగం కావడం సంతోషంగా ఉందని రామ్ చరణ్ తెలిపాడు. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ.. చరిత్రలో గుర్తుండిపోయే రోజు ఇది. ఇందులో భాగం కావడం అరుదైన అవకాశంగా భావిస్తున్నా. నేను ఆంజనేయుడి భక్తుడిని. ఆయనే స్వయంగా నాకు ఆహ్వానం పంపించినట్లు అనిపించింది అని చిరు తెలిపాడు.
“It’s a long wait, we are all very honoured to be there.”
:- Ramcharan About #AyodhyaRamMandir #AyodhyaSriRamTemple #AyodhyaDham #Ayodha #AyodhyaJanmBhoomipic.twitter.com/HHjsQ3NhLB
— Suresh PRO (@SureshPRO_) January 22, 2024
మరోవైపు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సహా, సౌత్ సూపర్ స్టార్స్ రజినీకాంత్, ధనుష్, బీటౌన్ తారలు విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ – అలియా భట్, కంగనా రనౌత్, మాధురీ దీక్షిత్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తదితరులు కూడా ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

