BSNL | కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు తెచ్చింది. వాటిలో ఒకటి రూ.58ల డేటా ఓచర్ కాగా, మరొకటి రూ.59ల వ్యాలిడిటీ పొడిగింపు ప్లాన్.వీటిలో రూ.58 ప్లాన్ డేటా ఓచర్ పొందాలంటే యూజర్లు కచ్చితంగా ఒక యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండాలి. ఈ ఓచర్ వ్యాలిడిటీ ఏడు రోజులు. ప్రతి రోజూ 2జీబీ డేటా పొందొచ్చు. పూర్తి డేటా అయిపోయిన తర్వాత వేగం 40కేబీపీఎస్ కు పడిపోతుంది. ఇక రూ.59 ప్లాన్ వ్యాలిడిటీ కూడా వారం రోజులే. ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు ఉండవు గానీ ప్రతి రోజూ ఒక జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ ఫెసిలిటి ఉంటుంది.