RCB vs DC : ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) వరుసగా ఐదో విక్టరీ కొట్టింది. కీలకమైన రెండు పాయింట్ల కోసం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను ఢిల్లీ చిత్తుగా ఓడింది. తొలుత రజత్ పాటిదార్(52), విల్ జాక్స్(41) విధ్వంసంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ఢిల్లీ ఆది నుంచి తడబడింది. బెంగళూరు బౌలర్లు, ఫీల్డర్ల జోరుతో వరుసగా వికెట్లు కోల్పోయి 140కే కుప్పకూలింది. కెప్టెన్ రిషభ్ పంత్ గైర్హాజరీలో పగ్గాలు అందుకున్న అక్షర్ పటేల్(57) అర్ధ శతకంతో చెలరేగినా ఢిల్లీని గెలిపించలేకపోయాడు. వరుసగా ఐదో విజయం నమోదు చేసిన డూప్లెసిస్ సేన 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఐదో స్థానానికి ఎగబాకింది.
చిన్నస్వామి స్టేడియంలో రజత్ పాటిదార్(52), విల్ జాక్స్(41) మెరుపులతో ఆర్సీబీ 186 రన్స్ కొట్టింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. తొలి ఓవర్లోనే ఇంప్యాక్ట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్(1) ఔటయ్యాడు. అతడితో మొదలు వచ్చిన వాళ్లు వచ్చినట్టు డగౌట్‌కు క్యూ కట్టారు.
David Warner ✅
Jake Fraser-McGurk ✅
Abishek Porel ✅#RCB with 3️⃣ wickets in the powerplay 💪Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/gUuiy0rA7R
— IndianPremierLeague (@IPL) May 12, 2024
యశ్ దయాల్ ఓవర్లో నాన్ స్ట్రయికర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(21) దురదృష్టం కొద్దీ రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు బంతికి అభిషేక్ పొరెల్(7) సులవైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో కుమార్ కుషగ్ర(2) ఎల్బీగా దొరికాడు. దాంతో, 30 పరుగులకే ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయింది.
షాహ్ హోప్(27)
ఆ దశలో ఢిల్లీని గట్టున పడేసే బాధ్యత తీసుకున్న షాహ్ హోప్(27), కెప్టెన్ అక్షర్ పటేల్(57)లు ఐదో వికెట్‌కు 56 రన్స్ జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసిన ఫెర్గూసన్ ఢిల్లీని ఓటమి అంచుల్లోకి నెట్టాడు. గ్రీన్ ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించిన ట్రిస్టన్ స్టబ్స్(3) అనూహ్యంగా రనౌట్ కావడంతో 90 పరుగులకే ఢిల్లీ ఆరో వికెట్ పడింది.
5️⃣0️⃣ for the #DC skipper 🙌
Axar Patel continues to fight from the one end 💪
Can he guide his team home despite losing partners at the other end? 🤔
Follow the Match ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/jydcM6fPEZ
— IndianPremierLeague (@IPL) May 12, 2024
అయినా సరే.. అక్షర్ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి ఢిల్లీ స్కోర్ 120 దాటించాడు. అయితే.. బంతి అందుకున్న దయాల్ అతడిని వెనక్కి పంపి ఆర్సీబీని గెలుపు వాకిట నిలిపాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతికే దయాల్ .. కుల్దీప్ యాదవ్(6)ను బౌల్డ్ చేయడంతో 140 పరుగులకు ఢిల్లీ ఆలౌటయ్యింది. దాంతో, ఆర్సీబీ 47 పరుగుల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది.
Wrapped up in style ⚡️
High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥
A comfortable 4️⃣7️⃣-run win at home 🥳
Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE
— IndianPremierLeague (@IPL) May 12, 2024
ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చితక్కొట్టారు. చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఉతికేస్తూ ఆర్సీబీ రజత్ పాటిదార్(52) విధ్వంసం సృష్టించాడు. 36 పరుగులకే ఫాఫ్ డూప్లెసిస్ (6), విరాట్ కోహ్లీ(27) లు వెనుదిరగడంతో ఒత్తిడిలో పడిన ఆర్సీబీని ఆదుకున్నాడు. అర్ధ సెంచరీతో చెలరేగిన పాటిదార్.. డేంజరస్ విల్ జాక్స్(41)తో 88 రన్స్ జోడించాడు. చివర్లో కామెరూన్ గ్రీన్(30 నాటౌట్) దంచడంతో, ఆర్సీబీ ప్రత్యర్థి ముందు 188 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/31), రసిక్ సలాం(2/23)లు రాణించారు.
Innings Break!
A solid 3️⃣rd wicket partnership help #RCB set a 🎯 of 1️⃣8️⃣8️⃣
With 2️⃣ crucial points up for grabs, which way is this one going? 🤔
Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/g24jQoXjKD
— IndianPremierLeague (@IPL) May 12, 2024