గుడిగా మారి వేదనాదాన్ని దశ దిశలా ప్రతిధ్వనింపజేస్తాను!
ఇటుక ఇటుకా ఏమౌతావు!
మసీదుగా కట్టడమై నమాజ్‌తో లోక క్షేమం కోసం అల్లాను ప్రార్థిస్తాను!
ఇటుక ఇటుకా ఏమౌతావు!
నింగినంటే చర్చినై విశ్వాసంగా ప్రార్థిస్తూ ప్రేమ తత్త్వాన్ని పావురాలుగా ఎగరేస్తాను!
నేను ఇటుకనే అయినా సర్వమత సమానత్వం భారతీయత అని ప్రపంచ హృదయమౌతాను!
చిన్న ఇటుకనే కానీ మౌనంగా సమస్త మందిరాల సమస్త ప్రార్థనల సంగమ పుణ్యక్షేత్రాన్ని!
కందాళై రాఘవాచార్య
87905 93638