టాలీవుడ్ (Tollywood) హీరోయిన్లలో ఫిట్నెస్ మంత్రను తప్పక ఫాలో అయ్యే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా..? అందరూ వెంటనే చెప్పే పేరు రకుల్‌ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh). తనను తాను చురుకుగా, స్లిమ్‌గా ఉంచుకునేందుకు తరచూ జిమ్‌లో వర్కవుట్స్ చేయడమే కాకుండా యోగాసనాలు కూడా వేస్తుంది. అంతేకాదు తన ఫాలోవర్లకు కూడా సులభమైన చిట్కాలు చెప్తుంటుంది. తాజాగా శుక్రవారం ఉదయం కొత్త యోగా స్టిల్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
సెలబ్రిటీ యోగా ట్రైనర్ అన్షుకా (Anshuka) పర్యవేక్షణలో యోగా వీల్‌పై శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆసనం వేసింది. మరో ఫొటోలో తలకిందులుగా కాళ్లను వంచి పిరమిడ్ పొజిషన్లో ఫ్లోర్ ను టచ్ చేస్తూ ఆసనం వేసింది. ఈ స్టిల్స్ కు యోగా అనేది ఫ్లెక్సిబిల్ కోసం కాదు..ఇష్టం కోసం అంటూ క్యాప్షన్ ఇస్తూ అన్షుకకు ట్యాగ్ చేసింది. అలియాభట్, కరీనా కపూర్ ఖాన్, అనన్యపాండేకు కూడా అన్షుకా యోగా ట్రైనర్‌గా వ్యవహరిస్తోంది.
ఫిట్నెస్ ప్రియుల్లో స్ఫూర్తిని కలిగించేలా రకుల్ పెట్టిన పోస్ట్‌కు హర్ట్, ఫైర్ ఎమోజీలను పెట్టారు నెటిజన్లు. జాగ్రత్త..మీరు ప్రదర్శన చేస్తూ ఉంటే ఒక రోజు ఓడించడానికి చాలా శక్తివంతంగా మారవచ్చు. అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ఇటీవలే నిర్మాత జాకీ భగ్నానీతో రిలేషన్షిప్లో ఉన్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత