Vettaiyan Trailer | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. తలైవా కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం వెట్టైయాన్ (Vettaiyan). జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంఅక్టోబర్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ అప్డేట్ అందించారు.
వెట్టైయాన్ ట్రైలర్‌ను అక్టోబర్ 2న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. రజినీకాంత్ బ్లాక్ షర్ట్ విత్ స్టైలిష్ గాగుల్స్‌తో కనిపిస్తుండగా.. మరోవైపు బుల్లెట్లు చూడొచ్చు. టార్గెట్ సెట్ అయింది.. అంటూ లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన తాజా లుక్ నెట్టింటిని షేక్ చేస్తోంది. మేకర్స్ ఇటీవలే బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న రజినీకాంత్ ఆయుధాన్ని పట్టుకుని గూండాల భరతం పట్టి.. మరోవైపు జేబులో చేయి పెట్టుకొని సూపర్ స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రావు రమేశ్, రోహిణి మొల్లేటి కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
The Target is set! 🎯 The VETTAIYAN 🕶️ trailer is dropping on October 2nd. 🔥 Get ready to catch the prey. 🦅#Vettaiyan 🕶️ Releasing on 10th October in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran… pic.twitter.com/Qs8w8xJRqH
— Lyca Productions (@LycaProductions) September 30, 2024
Kamal Haasan | సల్మాన్ ఖాన్, అట్లీ సినిమాకు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Kannappa | పిలక-గిలకగా సప్తగిరి, బ్రహ్మానందం.. మంచు విష్ణు కన్నప్ప నయా లుక్ వైరల్
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!