Rajinikanth | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ 2తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు కమల్‌హాసన్‌తో కలిసి మల్టీ స్టారర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కమల్ హాసన్ నిర్మించనున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడంటూ వార్తలు వస్తుండగా తలైవా టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. రజినీకాంత్ మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడన్న ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు అభిమానులను ఖుషీ చేస్తోంది.
తలైవా పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సీతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. హార్రర్ కామెడీ ప్రాంచైజీ అరణ్మనైని తెరకెక్కించడంలో సుందర్కున్న సూపర్ పాపులారిటీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రజినీకాంత్-సుందర్ సీ కాంబోలో వచ్చిన అరుణాచలం ఏ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో తెలిసిందే.
ఈ సూపర్ హిట్ కాంబోలో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగడం ఖాయమైనట్టేనంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రాన్ని తమిళ యాక్టర్ కమ్ పొలిటీషియన్ ఉదయనిధి స్టాలిన్ రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట. మరి రానున్న రోజుల్లో సుందర్ సీ, రజినీకాంత్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
Shreyas Talpade | భారీ పెట్టుబడి మోసం కేసు .. చిక్కుల్లో బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్
The Girlfriend Trailer | రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ విడుదల
Srinu Vaitla | శ్రీను వైట్లకి హీరో దొరికాడా..ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..!