Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ సలామ్ (Lal Salaam). ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. లాల్ సలామ్ ఈ ఏడాది ఫిబ్రవరి 9న భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా విడుదల కాగా.. ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
థియేటర్లలోకి వచ్చి 9 నెలలు దాటినా ఓటీటీ డెబ్యూ విషయంలో మాత్రం డైలామా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే టీవీలో సందడి చేసేందుకు రెడీ అయింది లాల్ సలామ్. అయితే ఈ మూవీ రెండు ఛానెళ్లలో సందడి చేయనుండటం విశేషం. లాల్ సలామ్ హిందీ వెర్షన్ జీ సినిమాలో డిసెంబర్ 14 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ కానుండగా.. జీ టీవీలో డిసెంబర్ 15 సాయంత్రం 4 గంటలకు ప్రీమియర్ కానుంది.
అయితే ఈ మూవీ తెలుగు, తమిళ వెర్షన్లకు సంబంధించిన టీవీ ప్రీమియర్ డేట్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి మేకర్స్ రానున్న రోజుల్లో ఏదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. థియేటర్లలో అంతగా ఇంప్రెస్ చేయని.. ఈ సినిమా టీవీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ తెరకెక్కించగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Finally Hard Disk Lost Fame Film #LalSalaam Television Premiere On ZEE Cinema in Hindi At December 14🔥 pic.twitter.com/9QTbbI4HUV
— Saloon Kada Shanmugam (@saloon_kada) November 30, 2024
Sandeham | ఓటీటీలో హెబ్బా పటేల్ ఫీవర్.. ట్రెండింగ్‌లో సందేహం
Trisha | గెట్ రెడీ.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న త్రిష